- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.
- Advertisement -