నవతెలంగాణ-హైదరాబాద్ : చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని అందుకుంది ‘లిటిల్‌హార్ట్స్’. మౌళి, శివాని నాగారం జంటగా సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. ఆ వేడుకలో నిర్మాత బండ్ల గణేశ్ సందడి చేశారు. తనదైన శైలి ప్రసంగంతో అలరించారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ”ఏడెనిమిది సంవత్సరాల తర్వాత నాకు కిక్కిచ్చిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా.. ఈ సినిమాకి ముందు మౌళి పోస్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. సినిమా ఇండస్ట్రీకి కష్టాలు కన్నీళ్లు బాధలు.. అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని వందల కోట్లలో ఒకరు ఉంటాడు.. ఒక స్టార్ కమెడీయన్ కి కొడుకుగా పుడతాడు.. ఒక మెగాస్టార్ బావమరిదిగా ఉంటాడు.. ఒక ఐకాన్ స్టార్ కి తండ్రిగా ఉంటాడు. అలా వంద కోట్లలో ఒకడు ఉంటాడు. అందరూ అలా ఉండలేరు. మనందరం కష్టపడాల్సిందే.. తప్పదు. ఆయన ఎప్పుడు కాళ్ళ మీద కాలువేసుకుంటాడు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. ఆయన అనుకున్నవారికి అందుబాటులోకి వెళ్తాడు. అదీ జీవితం అంటే. అంత మహర్జాతకుడ్ని నా జీవితంలో నేను చూడలేదు. ఇక చూడను కూడా. ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అల్లు అరవింద్ ఇక్కడకు రావటం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ ఫాదర్ నేను రూమ్ మేట్స్. అప్పట్లో మూడు రోజులు మిస్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి నాకు కొడుకు పుట్టాడు అన్నాడు. ‘హీరో పుట్టాడా’ అని నేను ఆయనతో అన్నాను. నా జీవితంతో నేను ఏదన్నా అంటే అవుద్ది. నేను అంత ఎమోషన్ పర్సన్ ని” అని అన్నారు.