Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంకాపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ 

అంకాపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
చదువు మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. చిన్నప్పటినుండి మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకుంటే ఎంతటి వారైనా గొప్ప స్థాయికి చేరుకుంటారని, చదువుకు పేద ధనిక తేడా అవసరం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంకాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసయ్య అన్నారు. మాజీ సర్పంచ్ స్వర్గీయ గడ్డం రాజన్న స్మారకంగా శుక్రవారం ఉన్నత పాఠశాలలోనీ 100 మంది విద్యార్థులకు వారి భార్య లక్ష్మీ చేతుల మీదుగా రాజన్న కుమారుడు అమెరికాలో నివాసం ఉంటున్న రమేష్ రెడ్డి  స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేయించారు.

ఇదే కార్యక్రమంలో గ్రామానికి చెందిన వెల్డర్ ప్రసాద్ దేశ నాయకుల చిత్రపటాలను పాఠశాలకు అందజేశారు. రాజన్న  గ్రామానికి చేసిన సేవలు, వారి కుటుంబ సభ్యులు పాఠశాలకు అందిస్తున్న సహాయ, సహకారాలు సౌకర్యాల గురించి ప్రముఖ కళాకారుడు డాక్టర్ కోకిల నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సోదరుడు గడ్డం చిన్న రాజన్న  విడిసి గంగారెడ్డి, జంగం మురళి, వినోద్ రెడ్డి, రాజన్న కుటుంబ సభ్యులు రాజారెడ్డి, రాజలింగం, నర్సారెడ్డి, రత్న , ప్రతాప్  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -