నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక పెన్షనర్ భవన్ లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం మొన్న ఇచ్చిన ప్రమోషన్లో మిగిలిపోయిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. పిఆర్సి ఇప్పటికే బాగా ఆలస్యం అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఇప్పటికైనా మేనిఫెస్టో లో పెట్టిన అంశాలను పరిష్కరించాలని కోరారు.
అనంతరం జిల్లా కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంజరిగింది.జిల్లా అధ్యక్షులు గా శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి గా ధర్మేందర్,,ఆర్ధిక కార్యదర్శి అఫ్జల్ బెగ్,సహా అధ్యక్షులుగా కాంతా రావు,మహేశ్వర్,రవీందర్ గౌడ్,అదనపు కార్య దర్శులుగా గంగా కిషన్,కృష్ణకుమార్, కిషోర్ కుమార్ ఉపాధ్యక్షులుగా యాదగిరి మల్లయ్య, ముక్బుల్ హుస్సేన్,శ్రీనివాస్,సుధాకర్ రెడ్డి వెంకటేశ్వరరావు కృష్ణ రత్నాకర్.కార్యదర్శులుగా సురేందర్, ఇక్బాల్ ఆలీ ఖాన్,కృష్ణ శ్రీనివాస్ ముద్దు కృష్ణ, చంద్ర శేఖర్,ప్రసాద్ ఆర్ధిక కమిటీ సభ్యులుగా శ్రవణ్,జాకీర్ రాష్ట్ర కౌన్సిలర్ గా బి. శ్రీనివాస్, ఏ .శ్రీనివాస్, బాల చంద్రం,సలహా దారులుగా వెంకట నారాయణ గౌడ్,సాయన్న, ప్రసాద్ లు ఎన్నికైనారు.
స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చీమల శ్రీకాంత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES