నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని ఆనంతారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 1, & 2, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల లను నీతి అయోగ్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ మెంబర్ ఐ వి సుబ్బారావు సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ కేంద్రం కల్పిస్తున్న సదుపాయాలు, పిల్లలు నేర్చుకున్న విషయాలను అడిగి, తల్లులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలు, పోషకాహారం ప్రాధాన్యత , అందిస్తున్న పోషకాహారం పరిశీలించారు.
ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనం సరఫరా, నాణ్యత, తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ వినియోగం, సైన్స్ ప్రయోగాల వినియోగం, ప్రాథమిక పాఠశాల 1,2 తరగతి విద్యార్థులతో కలిసి విద్య నాణ్యత, పిల్లల నైపుణ్యాలు పరిశీలించారు.అనంతారం గ్రామంలో అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు అభినందించారు.పిల్లల పఠనం, అభ్యాసన నైపుణ్యాలు బాగా ఉన్నాయని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ బాస్కర్ రావు , జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ, జిల్లా మహిళా సంక్షేమ అదికారి శ్రీ నర్సింహా రావు, యంపిడిఓ సిహెచ్ శ్రీనివాస్, యంపిఓ దినాకర్, ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, సిడిపిఓ శైలజ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.