Friday, September 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్మురిమడుగులో ఉచిత వైద్య శిబిరం..

మురిమడుగులో ఉచిత వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ఉమాశ్రీ, డా.లక్ష్మి సూచన మేరకు స్వాస్థ్య నారి స్వశక్తి పరివార అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా మురిమడుగు గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరంలో గ్రామంలోని మహిళలు అందరికీ రక్తహీనత, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులున్న వారిని పరీక్షలు చేసి మందులు అందించారు. వారికి ఆరోగ్యంపై తగిన వైద్య సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డా. గంగాదేవి, హెల్త్ అసిస్టెంట్  టేకుమట్ల పోచయ్య, జి.సులోచన, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -