తొలి అనధికారిక టెస్టు డ్రా
లక్నో: ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లను ఉతికారేసిన దేవ్‌దత్ పడిక్కల్(150), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(140) భారీ శతకాలతో మెరిసారు. దీంతో భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 7వికెట్ల నష్టానికి 531 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. చివరిరోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ వికెట్ల కోల్పోకుండా 56 పరుగులు చేసింది. దాంతో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. ఏక్నా క్రికెట్ స్టేడియంలో తొలుత ఆస్ట్రేలియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 532/6పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయగా.. అనంతరం భారత-ఎ జట్టు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), జగదీశన్ (64) హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చారు. సాయి సుదర్శన్(73) సైతం రాణించగా ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరు ఔటయ్యాక.. దేవ్‌దత్ పడిక్కల్(150) క్రీజులో పాతుకుపోయాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(8) త్వరగానే ఔటైనా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(140)తో కలిసి కంగారూ యువ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో జురెల్ సైతం బ్యాట్ ఝులిపించి సెంచరీ సాధించాడు. వీరిద్దరి మెరుపులతో భారత ఏ 531/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లు రోచిచ్చిలికి మూడు, ఓనెల్, బెర్ట్‌లెట్, స్కట్, కాన్లీకి ఒక్కో వికెట్ దక్కాయి. ఇరుజట్ల మధ్య రెండో, చివరి అనధికారిక టెస్ట్ 23నుంచి ప్రారంభం కానుంది.