Saturday, September 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంH-1Bవీసాపై భారీగా పెరిగిన ఫీజు..ఉద్యోగుల‌కు అమెజాన్ కీల‌క ఆదేశాలు

H-1Bవీసాపై భారీగా పెరిగిన ఫీజు..ఉద్యోగుల‌కు అమెజాన్ కీల‌క ఆదేశాలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌’ విధానాల్లో భాగంగా.. హెచ్‌ 1 – బి వీసా దరఖాస్తులపై రుసుమును లక్ష బిలియన్‌ డాలర్లకు అమాంతం పెంచేశారు. దీంతో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు.. తమ ఉద్యోగుల్ని రేపటిలోగా (సెప్టెంబర్‌ 21) అమెరికాను వీడి వచ్చేయండి అని హెచ్చరికలు జారీ చేసినట్లు తాజాగా రాయిటర్స్ న్యూస్ వెల్లడించింది.

అమెజాన్‌ హెచ్‌ 1- బి, హెచ్‌ -4 వీసాదారులు సెప్టెంబర్‌ 21లోగా అమెరికా నుంచి తిరిగి రావాలని తమ ఉద్యోగులకు సిఫార్సు చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్‌, జెపి మోర్గాన్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కూడా అమెజాన్‌ బాటే పట్టాయి. ఈ కంపెనీలు కూడా హెచ్‌ 1-బి, హెచ్‌ -4 వీసాదారులను గడువు ముగిసేలోపే (సెప్టెంబర్‌ 21లోపు) అమెరికా నుంచి వచ్చేయాలని సిఫార్సు చేసినట్లు రాయిటర్స్ న్యూస్ తెలిపింది.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాద్యతలు చేపట్టినప్పటినుంచే.. అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో.. విదేశీ వలసదారులకు చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. అమెరికా పౌరులకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. వలసదారులను అమెరికా నుంచి పంపించేలా వలస విధానాలను చేపట్టారు. అందులో భాగంగానే హెచ్‌-1 బి వీసాను లక్ష బిలియన్‌ డాలర్లకు పెంచేశారు. దీంతో అక్కడ ఉన్న విదేశీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఉన్నపళాన అమెరికా నుంచి వచ్చేయాలని హెచ్చరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -