- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని (అటనామస్) మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ అశోక్ మాట్లాడుతూ బతుకమ్మ విష్టతను, మన సంస్కృతి, సాంప్రదాయల గొప్పతనం తెలుసుకొని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థుల పై ఉందని సూచించారు. విద్యార్థులు సేకరించిన వివిధ రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -