నవతెలంగాణ-హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కరీంనగర్ పద్మనగర్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికి అందరూ నిద్రలో ఉండటంతో ప్రధాన దారి గుండా వెళ్తున్న వారు గమనించి కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కాగా సీఐ అప్రమత్తంగా వ్యవహరించి మంటలను పక్కకు వ్యాప్తి చెందకుండా స్వయంగా అక్కడ ఉన్న సామాగ్రిని పక్కకు తరలించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఐ చాకచక్యం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES