త్వరలోనే తీరనున్న ప్రజల ఇబ్బందులు..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు రహదారులకు త్వరలోనే మహర్దశ రాబోతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులను నివారించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) పథకం కింద రోడ్ల నిర్మాణానికి ఆమోదం లభించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగ వేములవాడ–కొరుట్ల ప్రధాన రహదారి వయా మర్రిపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, రుద్రoగి, పోశానిపేట, కథలపూర్, మిదిగా–కొరుట్ల వరకు, చందుర్తి మండలంలో చందుర్తి–మోత్కురావుపేట మధ్య 10 కి.మీ.కొనరావుపేట మండలంలో మామిడిపల్లి–నిజామాబాద్ గ్రామాల మధ్య 4.70 కి.మీ. బావుసాయిపేట–వెంట్రావుపేట మధ్య 3.30 కి.మీ.వట్టిమల్ల–నిమ్మపల్లి మధ్య 2.90 కి.మీ.వేములవాడ బ్రాంచ్ రోడ్ వయా చింతల్టన–వేములవాడ మున్సిపల్ వరకు 4.30 కి.మీ. ఈ రహదారుల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభమవనున్నాయని ఆయన తెలిపారు. దీంతో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు సమసిపోనున్నాయని ఆది శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు.