నవతెలంగాణ-హైదరాబాద్: డ్రోన్ల విన్యాసాల కార్యక్రమానికి హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (హెచ్‌క్యూ ఐడీఎస్) శ్రీకారం చుట్టింది. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో ఆర్మీ అధీనంలోని సెంట్రల్ సెక్టార్‌లో ఈ డ్రోన్ల విన్యాస కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల శక్తిసామర్థ్యాలు, శత్రు డ్రోన్లను ఎదుర్కోవడం, వాటిని నేలమట్టంచేయడం వంటి కీలక బాధ్యతలను అవి ఏమేరకు నెరవేర్చుతాయనే అంశాలను ఈ ఎక్సర్‌సైజ్‌లో పరిశీలించనున్నారు.త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ విన్యాసాల కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ జరిగిన ఐదు నెలల తర్వాత డ్రోన్ల ఎక్సర్‌సైజ్ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.
మధ్యప్రదేశ్‌లో డ్రోన్ల విన్యాసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES