Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్స్యకారులు బతుకమ్మలు వదిలే చెరువుల వద్ద ఉండాలి: కలెక్టర్

మత్స్యకారులు బతుకమ్మలు వదిలే చెరువుల వద్ద ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మత్స్యకారులు బతుకమ్మలు వదిలేకుంటలో చెరువుల వద్ద కాపలా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాలు ఈ నెల 21-09-2025 నుంచి 30 వరకు ప్రతి గ్రామములో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ ఆడే మహిళలకు పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా ప్రతి రోజు సాయంత్రం ప్రతి సంఘానికి 5 లేదా 10 మంది స్థానిక గ్రామ కార్యదర్శితో సమన్వయం చేసుకోవాలని అన్నారు. బతుకమ్మలు విడుచే చెరువుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -