అవుతాపురం గ్రామంలో విషాదఛాయలు
నవతెలంగాణ -పెద్దవంగర
చింతలకుంటలో గల్లంతైన కేబుల్ ఆపరేటర్ మృతదేహం లభ్యమైంది. డిష్ కేబుల్ వైర్ మరమ్మత్తు కు గురికావడంతో కుంట లోకి దిగిన యువకుడు గల్లంతైన విషయం విదితమే. ఎస్సై క్రాంతి కిరణ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని అశోక్ (35) కనకతార దంపతులకు శ్రావణి, యశ్వంత్ ఇద్దరు పిల్లలు సంతానం. ఆయన కేబుల్ ఆపరేటర్ గా, ఆటో నడుపుతూ గ్రామంలో భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అశోక్ కేబుల్ వైర్ మరమ్మతులకు గురైందని ఇంట్లో చెప్పి, మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లాడు.
అదేరోజు అతని తో పాటుగా మరో ఐదుగురు కలిసి మండలంలోని గంట్లకుంట పరిధిలోని చింతలకుంటలో ఉన్నా కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ తెగిపోవడాన్ని గుర్తించారు. ముందుగా ఇద్దరు వ్యక్తులు తెప్ప సహాయంతో స్థంభం వద్దకు వెళ్ళి, మరమ్మతులు చేస్తున్నారు. వారికి సహకరించడానికి అశోక్ ఈత కొట్టుకుంటూ కుంటలోకి వెళ్ళి, మద్యలోనే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ గల్లంతయ్యాడు. ఎస్సై క్రాంతి కిరణ్, తహశీల్దార్ వీరగంటి మహేందర్ ఘటన స్థలాన్ని సందర్శించి, ఆ రోజు రాత్రి వరకు రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
అయినా ఆచూకీ లభించకపోవడంతో రాత్రి కావడం వల్ల గాలింపు చర్యలు నిలిపివేశారు. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అశోక్ మృతదేహాం లభ్యమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశోక్ మృతదేహాంతో పోలీస్ స్టేషన్ సమీపంలో న్యాయం చయాలని ఆందోళనకు దిగారు. తొర్రూరు సీఐ గణేష్ వారితో మాట్లాడి, న్యాయం చేస్తామని నచ్చచెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గల్లంతైన కేబుల్ ఆపరేటర్ మృతదేహం లభ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES