- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణంలోని స్థానిక రక్షకభటుల కార్యాలయం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మధుసూదన్ రెడ్డి సిఐ మన్మధ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందికి సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ హోమియో వ్యాధి నివారణ ఔషదాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వర్షకాలంలో అంటూవ్యాధులు ప్రబలకుండా పోలీసులు ఆరోగ్య ఉంటేనే తమ విధిని సక్రమంగా నిర్వర్తిస్తారని అన్నారు. ముఖ్యంగా శరీరంలో కోలేస్ట్రాల్ ఎక్కువ ఉండడం చేత గుండె జబ్బులు వస్తాయని, ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించారు.
- Advertisement -