- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకున్న గోదావరి, శనివారం ఉదయం 9 గంటలకు 46.60 అడుగులకు పెరిగింది. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి పెరగడంతో భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారి బుర్ర వేముల, తూరుబాక వద్ద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
- Advertisement -