Saturday, September 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబంపర్ ఆఫర్..రూ.1499 లకే విమాన ప్రయాణం

బంపర్ ఆఫర్..రూ.1499 లకే విమాన ప్రయాణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కొత్త సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రోజుల పాటు కేవలం రూ.1,499 లకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమండ్రి – తిరుపతి మధ్య ఎలియన్స్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. వచ్చే నెల 1న ఈ సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా టికెట్ ధరను తొలుత రూ.1,999 లుగా నిర్ణయించగా.. ప్రస్తుతం దానిని రూ. 1,499 లకు మార్చారు. ఈ ఆఫర్ అక్టోబరు 2, 4, 6 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎలియన్స్‌ విమాన సంస్థ రాజమహేంద్రవరం మేనేజర్ తెలిపారు. వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఉదయం 10:15 గంటలకు మొదలవుతుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మాత్రం ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:40 కి తిరుపతి నుంచి విమానం బయలుదేరి 9:25 గంటలకు రాజమండ్రిలో ల్యాండవుతుంది. తిరిగి రాజమండ్రి నుంచి 9:50 గంటలకు బయలుదేరి 11:20 గంటలకు తిరుపతిలో ల్యాండవుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -