నవతెలంగాణ-నసురుల్లాబాద్
పరిసరాల పరిశుభ్రత, హరితహారం లాంటి వాటి కోసం స్వచ్ఛభారత్, పల్లె ప్రగతి కార్యక్రమాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు కేటాయించి పల్లెల్ని ప్రగతి సోపానాలుగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నాయి. కానీ.. కొందరు అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో నీరుగారుతోంది. గ్రామాల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత విషయమై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకం, వాటి ప్రాధాన్యతను నిత్యం వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అలాంటిది బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయల అధికారులు మాత్రం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం మాటేమోగానీ సొంత కార్యాలయంలోనే స్వచ్ఛ భారత్ ను విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నిండా పిచ్చి మొక్కలు, బురదగుంటలే దర్శనమిస్తాయని తెలియజేస్తున్నారు. కార్యాలయంలో పేరుకుపోయిన విపరీతమైన పిచ్చి మొక్కల మూలంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఎదుగుదల లేకుండా పోతున్నాయాంటూ నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పల్లె ప్రగతి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుంది. ఇప్పటికైనా తహసీల్దార్ కార్యాలయ అధికారులు మేలుకొని చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు హరితహార కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఉందంటూ సూచిస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES