Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు 

పంచాయితీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు 

- Advertisement -

– మండలాల వారిగా ప్రకటించిన ఆర్డిఓ రామ్మూర్తి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

స్థానిక సంస్థల ఎన్నికలకు శనివారం ఐఓసీ కార్యాలయంలో ఆర్డిఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో మండలాల వారిగా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. హుస్నాబాద్ ,అక్కన్నపేట, కోహెడ ,బెజ్జంకి, మద్దూర్, దూలిమిట్ట మండలాల చెందిన వివిధ పార్టీల నాయకుల సమక్షంలో రిజర్వేషన్ లను కేటాయించారు.

హుస్నాబాద్ ఎంపీటీసీ లు

గాంధీనగర్ బిసి మహిళ , పందిళ్ళ ఎస్టి జనరల్, పొట్లపల్లి ఎస్సీ జనరల్, మహమ్మదాపూర్ జనరల్, పోతారం ఎస్ బీసీ జనరల్, మీర్జాపూర్ బీసీ జనరల్ గా కేటాయించారు. సర్పంచ్ లుగా తోటపల్లి జనరల్, జిల్లేల్ల గడ్డ ST జనరల్ ,వంగరమయ్యపల్లి ఎస్టి మహిళ, మీర్జాపూర్ ఎస్సీ జనరల్ , పోతారం ఎస్ ఎస్సి మహిళ, పొట్లపల్లి ఎస్సీ జనరల్, బంజేరుపల్లి బిసి మహిళ, గాంధీనగర్ బిసి జనరల్, కుచనపల్లి బీసీ జనరల్, మాలపల్లి బిసి మహిళ, పందిల బీసీ మహిళ, రాముంపల్లి బీసీ జనరల్, ఉమ్మాపూర్ బీసీ జనరల్, మడుద జనరల్, నాగారం జనరల్ మహిళ, బల్ నాయక్ తండ  జనరల్, మహమ్మదాపూర్ జనరల్ మహిళ గా రిజర్వేషన్ ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవోలు ఎంపీలు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -