Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు.!

ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జిల్లా కలెక్టర్ చాంబర్ లో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మిలు వివిధ పార్టీల ముఖ్య లీడర్ల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎంపిక చేసిన మేరకు జిల్లాలోని 12మండలాలకు సంబంధించిన ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. టేకుమట్ల ఎంపీపీ (ఎస్సీ జనరల్), జడ్పీటీసీ (ఎస్సీ మహిళ), మొగుళ్లపల్లి ఎంపీపీ (జనరల్), జడ్పీటీసీ (జనరల్ మహిళ), చిట్యాల ఎంపీపీ(బీసీ జనరల్), జడ్పీటీసీ (బీసీ జనరల్), రేగొండ ఎంపీపీ (జనరల్), జడ్పీటీసీ (జనరల్), గోరికొత్తపల్లి ఎంపీపీ (బీసీ మహిళ), జడ్పీటీసీ (బీసీ మహిళ), గణపురం ఎంపీపీ (బీసీ జనరల్), జడ్పీటీసీ (బీసీ మహిళ), భూపాలపల్లి ఎంపీపీ (బీసీ జనరల్), జడ్పీటీసీ (బీసీ జనరల్), మల్హర్ ఎంపీపీ (ఎస్సీ మహిళ), జడ్పీటీసీ (ఎస్సీ), కాటారం ఎంపీపీ (జనరల్ మహిళ), జడ్పీటీసీ (జనరల్), మహాముత్తారం ఎంపీపీ (ఎస్టీ జనరల్), జడ్పీటీసీ (ఎస్టీ జనరల్), మహాదేవపూర్ ఎంపీపీ (బీసీ జనరల్), జడ్పీటీసీ (బీసీ జనరల్), పలిమెల ఎంపీపీ (ఎస్సీ జనరల్), జడ్పీటీసీ (ఎస్సీ జనరల్) గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -