Sunday, September 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అడెల్లి మహాపోచమ్మకు పుట్టింటి పట్టుచీరా.. సారె

అడెల్లి మహాపోచమ్మకు పుట్టింటి పట్టుచీరా.. సారె

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారికి ఆదివారం గంగనీళ్ల జాతర సందర్భంగా ఉదయం ఐదుగంటలకు అమ్మవారికి పుట్టింటి చీరా.. సారెగా పద్మ శాలి వంశస్థులు సమర్పించారు. ఆలయ పూజరి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుఖ సంతోషాలుగా ఉండేలా చూడాలని అమ్మవారికి మ్రొక్కుకున్నారు. అనంతరం మండల పద్మ శాలి సంఘం సభ్యులు మాట్లాడారు. అడెల్లి శ్రీ మహా పోచమ్మ పద్మశాలిలా ఆడబిడ్డగా.. ప్రతి యేటా ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అధికారికంగా జాతర సందర్భంగా మొదటగా అమ్మవారికి పద్మశాలి వంశస్థులు చేనేత వస్త్రాలు సమర్పించేలా జి.ఓ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పద్మ వీరయ్య,మండలంలోని ఆయా గ్రామాల పద్మ శాలి సంఘ అధ్యక్ష,కార్యదర్శులు,కుల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -