నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మరియు ప్రింటింగ్ ప్రెస్ వర్కర్ అధ్యక్షులు బి మల్లేష్ వర్ధంతిని IFTU నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకా నగర్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా IFTU జిల్లా సహాయ కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ.. కార్మికవర్గ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ, కార్మికుల హక్కులకై, సమానత్వం కై పోరాడి నిజామాబాద్ జిల్లాలో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకులు కామ్రేడ్ బి మల్లేశం అన్న అని అన్నారు. సమాజంలో ప్రజలకు సౌకర్యాలు పెరిగిన అంతరాలు అలాగే ఉన్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న విభజించు రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, మల్లేశన్న ఆశయ సాధన కోసం కార్మిక వర్గ ఐక్యతతో ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU నగర కార్యదర్శి ఎం శివ కుమార్, HRF జిల్లా కార్యదర్శి జి రమేష్, శంకర్, మరియు కార్మికులు పాల్గొన్నారు.
అంతరాలు లేని సమ సమాజ స్థాపనే మల్లేశన్న ఆశయ సాధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES