జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ-రామారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భేష జాలం కు పోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండాను ఎగరవేద్దామని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. మండలంలోని మద్దికుంటలో కాంగ్రెస్ శ్రేణులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరం పోటీ కాకుండా, ప్రత్యర్థి పై గెలిచే వ్యక్తులను ఎంచుకొని, వారి గెలుపుకు కృషి చేద్దామని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, దుంపల బాలరాజు, గజ్జల చిన్నరాజు, రేకులపల్లి కిష్టారెడ్డి, కామిల్ల నరేందర్, బండి రవి, దుంపల ప్రేమ్, శ్రీకాంత్, తోట రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
బేషజాలాలకు పోకుండా కలసికట్టుగా పనిచేద్దాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES