Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా..

జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
నియోజకవర్గంలోని నందిపేట్ తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బార్ల అనిల్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన గ్రూప్- 2 ఫలితాలలో సత్తా చాటాడు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన అనిల్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 248 ర్యాంకు సాధించి ఎక్సైజ్ శాఖలో ఎస్సై కొలువుకు ఎంపికయ్యాడు. 20 17 సంవత్సరంలో అగ్నిమాపక శాఖలో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, 2024 లో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా, ఇదే సంవత్సరం డిసెంబర్లో గ్రూప్ 4 పరీక్ష ద్వారా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా కొలువు సాధించాడు. ఉద్యోగం చేస్తూనే ప్రస్తుతం గ్రూప్ 2లో 379,706 లో మార్కులు సాధించాడు. గ్రూప్ మూడులో సైతం 455 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా యువకుడికి గ్రామస్తులు ,బంధువులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -