నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఖలీల్ వాడిలో గల రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయ ఆవరణలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజాంబాద్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని ఆరోగ్యవంతులైన వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల వారి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం జరగదని వారు తెలిపారు. రక్తం దానం చేయడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు కానీ, పురుషులు కానీ తిరిగి ఆరోగ్యవంతులు అవుతారని అన్నారు. యాక్సిడెంట్ అయి రక్తం కోల్పోయిన వ్యక్తులకు రక్తం అందించడం వల్ల వారు పునర్జీవితులవుతారని, కాబట్టి రక్తదానం మహాదానమని అందుకే మంగళవారం క్లబ్ తరఫున రక్తదాన శిబిరం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, రంజిత్ సింగ్ ఠాకూర్, డాక్టర్ వినోద్ పవర్, చంద్రశేఖర్, శంకర్, నీతి శేఖర్, సూర్య ప్రకాష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు అని తెలియజేశారు. క్లబ్ తరఫున ఇటువంటిఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు.
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES