నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామ ప్రజలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామానికి మండల కేంద్రానికి మధ్య లేండి వాగు ఉంది. ఈ వాగుపైన ఓవర్ బ్రిడ్జ్ లేక ఎప్పుడు వరదలు వచ్చినా.. వరద ఉధృతికి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో ఈ గ్రామానికి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాగు నిండుగా పారుతోంది. మంగళవారం మద్నూర్ సింగిల్ విండో మహాజన సభకు ఆ గ్రామానికి చెందిన శివాజీ రాథోడ్ డైరెక్టర్గా హాజరు కావలసి ఉంది. అయితే వాగు నిండుగా పారడం వలన వరద నీటితో రోడ్డు పూర్తిగా కొట్టుకపోయింది. ఇక చేసేదేమీ లేక తీవ్ర వ్యయప్రయాసలకు ఓర్చుతూ.. మహారాష్ట్ర ప్రాంతం నుండి 40 కిలోమీటర్ల తిరుగు ప్రయాణంతో మహాజన సభకు హాజరైనట్లు ఆయన నవతెలంగాణతో వాపోయారు. ఈ క్రమంలో కొట్టుకుపోయిన రోడ్డు చిత్రాలను చూపించారు. వాగుపై వంతెన లేక వరదలు వస్తే మాకు తెలంగాణ ప్రాంతంతో సంబంధాలు తెగిపోతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ అవసరానికైనా మాకు మహారాష్ట్ర దిక్కే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వాగుపై వంతెన నిర్మించాలని, అధేవిధంగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.
వరద నీటికి కొట్టుకపోయిన బీటి రోడ్డు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES