Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరి పొలాలను పరిశీలించిన ఏఓ

వరి పొలాలను పరిశీలించిన ఏఓ

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని వెంకటాపుర్ మరియు మేడిపల్లి శివారు లోని వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులు కర్ణేశ్వర్ , దీక్షిత్ రెడ్డి మరియు రైతులతో కలిసి మండల వ్యవసాయ అధికారి రాజలింగం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ .. ప్రస్తుతం వరి లో మోగిపురుగును ,మెడవిరుపు మరియు వరి లో ఎండు తెగులు ను గమనించడం జరిగింది. మోగిపురుగు నివారణకు నోవాల్యురాన్ 5.25+ ఎండాక్స్కార్బ్  300గ్రాములు 200లీ. నీటిలో లేదా కలిపి పిచికారీ చేస్కోవాలని, మెడవిరుపు మరియు అగ్గితెగులు నివారణకు పైకాక్సీస్టోబిన్ 6.5ట్రీసైక్లోజల్ 21.33 250 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చెయ్యాలి అని తెలియజేయడం జరిగింది. వరిలో సుడి దోమ కు పైమెట్రోజిన్ 5 120 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలియజేయడం జరిగింది. రైతులు నత్రజని సంబంధిత ఎరువులను తగ్గించి వాడాలని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులుపాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -