మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
స్థానిక సంస్థల ఎన్నికలకు సీపీఐ (ఎం) కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో మంగళ వారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్రజెండాకు ప్రజలు మద్దతుగా నిలవాలని, పార్టీ అభ్యర్థులను గెలి పించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే ఎర్రజెండా నాయకులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం నిర్వహిస్తున్న ఎర్రజెండాకు ఎన్నికల్లో మద్దతు తెలిపి అత్యధిక స్థానాలకు గెలిపించాలని పిలుపు నిచ్చారు.
రిజర్వేషన్ కేటాయింపులో అవకతవతలు జరిగాయని, వాటిని సవరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టాలను తీర్చాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, నాయకులు రవి నాయక్, వినోద్ నాయక్, శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్, రేమిడాల పరుశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, భావాండ్ల పాండు, అయ్యూబ్, తిరుపతి, రామ్మూర్తి, జటంగి సైదులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES