Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆదిత్య వింటేజ్‌ నిర్మాణాలపై చర్యలేవి?

ఆదిత్య వింటేజ్‌ నిర్మాణాలపై చర్యలేవి?

- Advertisement -

హైడ్రాకు పేదల ఇండ్లే కనిపిస్తాయా : ఎంపీ రఘునందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా సర్వీసు రోడ్డును ఆక్రమించి మరీ ఆదిత్య వింటేజ్‌ సంస్థ భారీ భవనం నిర్మిస్తున్నదని బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌ ఆ సంస్థకు అనుమతులు ఇచ్చారనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఆ నిర్మాణాలను ఆపించారని గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు ఎలా నిర్మాణాలు మొదలుపెట్టారని అడిగారు. సర్వీస్‌ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం జరుగుతున్నా హైడ్రాకు పట్టదా? అని నిలదీశారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాలతో కూడిన కాపీని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు పంపుతానన్నారు. హైడ్రాకు కేవలం పేదల ఇండ్లే కనిపిస్తాయా? పెద్దల భవనాలు కనిపించవా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిం చారు. హెచ్‌ఎమ్‌డీఏ అధి కారులే కేసులు వేస్తారనీ, మళ్లీ వారే ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఈ నిర్మాణ అనుమతులలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇన్వాల్వ్‌ అయ్యారా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్వాల్వ్‌ అయ్యారా? అనేది తేలాలన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, హద్దులు తొలగించారని క్రిమినల్‌ కేసులు నమోదు చేశారనీ, ఈ నిర్మాణంలో సూట్‌ కేసులు అందుకుంటున్న మంత్రులు ఎవరో సీఎం రేవంత్‌ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఆ మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీకి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -