గులాబీ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టిన మహేశ్‌కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుప్పలు, తెప్పలుగా చేసిన లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం కూడా బాకీ పడినట్టేనా? అంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ గులాబీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రచాకరం చేయడం సిగ్గుచేటన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎంత మందికి దళిత బంధు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా బకాయి పడ్డట్టా? ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచడం, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, వరికి బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం కూడా బకాయి పడ్డట్టా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫార్ములా ఈ కార్ రేస్‌లో అక్రమాలు, పలు ప్రభుత్వ పథకాల్లో కుంభకో ణాలు…ఇలా ఒక్కొక్కటి బయట పడుతుండడంతో గులాబీ దండుకు దిక్కుతోచక ‘బకాయి కార్డు’ పేరుతో మోసపూరిత ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలుపుకోవడం కాంగ్రెస్‌కే సాధ్యమని చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో మరోసారి నిరూపితమైందని చెప్పారు. బీసీ రిజర్వే షన్ల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అభిప్రాయంతో ఉన్నా యని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ చేసిన బాకీకి (అప్పులకు) కాంగ్రెస్ సర్కారు వడ్డీలు చెల్లిస్తున్నదని తెలిపారు. బకాయిల్లో మొదటి ముద్దాయి కేేసీఆరే అని విమర్శించారు. బకాయిల గురించి బీఆర్‌ఎస్ మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తు న్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ బకాయి కార్డులను చూసి ప్రజలు నవ్వుకుంంటున్నారని తెలిపారు. మిగు లు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిందని విమర్శించారు. నిరుద్యోగుల కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట్టా? రైతు భరోసా ఇస్తే బాకీ పడ్డట్టా? ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పిన బీఆర్‌ఎస్ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
‘బకాయి’ ముద్దాయి బీఆర్‌ఎస్సే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES