- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:
మద్యం లోడుతో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడలో జరిగింది. వాహనంలో మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ ఘటనలో కొన్ని మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇది ఇలా ఉండగా మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు.
- Advertisement -