Wednesday, December 3, 2025
E-PAPER
Homeవరంగల్పదవి విరమణ పొందిన కొయ్యుర్ రేంజర్

పదవి విరమణ పొందిన కొయ్యుర్ రేంజర్

- Advertisement -

తోటి ఉద్యోగుల ఆత్మీయ సన్మానం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ పారెస్ట్ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి.రాజేశ్వర్ రావు బుధవారం పదవి విరమణ పొందారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభకు జిల్లా స్థాయి అధికారుల నుంచి గ్రామీణ స్థాయి అధికారుల వరకు రాజేశ్వర్ రావు దంపతులకు పూలమాలలు, శాలువాలతో ఆత్మీయ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. దంపతులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పారెస్ట్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -