Friday, October 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుdevaragattu bunny festival : హింసాత్మకంగా మారిన కర్రల సమరం…ఇద్దరు మృతి..100 మందికి గాయాలు..

devaragattu bunny festival : హింసాత్మకంగా మారిన కర్రల సమరం…ఇద్దరు మృతి..100 మందికి గాయాలు..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో అర్థరాత్రి హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గట్టులో గురువారం అర్ధరాత్రి మాళ మల్లేశ్వరస్వామి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా.. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలుగురికి తలలు పగిలాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఉత్సవాతలకు దాదాపు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయినా ఇలాంటి ఘటనలు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -