జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానంద్ పటేల్ ఆధ్వర్యంలో ఆ మండలానికి చెందిన ముఖ్య నాయకులు తరలి వెళ్లి ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావుకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గజానంద్ పటేల్ వెంట తరలి వెళ్లిన వారిలో ఉమాకాంత్ పటేల్, దిగంబర్ పటేల్, దీన్ దయాల్, శివారెడ్డి, గౌస్ పటేల్, చాంద్ పటేల్ ,తదితరులు ఉన్నారు.