Saturday, October 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమరణించినా… మళ్లీ బతకొచ్చు

మరణించినా… మళ్లీ బతకొచ్చు

- Advertisement -

అవయవదాతల పునర్జన్మ
ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
అడ్డొస్తున్న మూఢనమ్మకాలు
స్ఫూర్తినిస్తున్న కమ్యూనిస్టులు
‘జీవన్‌దాన్‌’లో పెరుగుతున్న వెయిటింగ్‌ లిస్ట్‌
దశాబ్దాలుగా ఆ విభాగానికి ఇన్‌చార్జీలే దిక్కు

”రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన 28 ఏండ్ల యువకుడు సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించడంతో 8 మందికి పునర్జన్మను ప్రసాదించారు. మరణించినా, తాను బతికే ఉన్నానని సదరు యువకుడు నిరూపించాడు” పత్రికల్లో ఇలాంటి వార్తలు చదవగానే ‘గ్రేట్‌’ అనని పాఠకులు ఉండరు. అయితే అది ప్రశంసకే పరిమితమవుతుంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని, మరికొందరు అవయవదానాలు చేసేలా ప్రోత్సహించేంత స్ఫూర్తి సమాజంలో కనిపించట్లేదు. దీనికి సమాజంలో పేరుకుపోయిన ఆత్మ, ప్రేతాత్మ వంటి మూఢనమ్మకాలు ఓ కారణం అయితే, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో కమ్యూనిస్టులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సహజమరణం పొందినా, తమ భౌతికదేహాల్ని వైద్య పరిశోధనల కోసం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలకు విరాళంగా ఇచ్చేస్తున్నారు. అలాంటి మార్గాన్ని సమాజంలో విస్తరింపచేయడంలో పాలకుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. దానికి కారణం వారు కూడా ‘కర్మ సిద్ధాంతం’
అనే మూఢ విశ్వాసంలో కొట్టుమిట్టాడుతుండటమే!

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అనేక విపరిణామాలకు వైద్యశాస్త్రం పలు పరిష్కారాలను చూపిస్తూ వచ్చింది. వైద్య పరిశోధనల అద్భుత ఆవిష్కరణ అవయవమార్పిడి. మనిషి శరీరంలో అవయవం పూర్తిగా పాడైపోయి ఎందుకు పనికి రాని స్థితిలో వైద్యులు అవయవమార్పిడి చేసి, తిరిగి ప్రాణాల్ని నిలబెడతారు. అయితే ఇందుకోసం అవయవాలను దానం చేసే వారు అవసరం. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం చేస్తే వాటితో కనీసం ఎనిమిది మందికి ప్రాణం పొయొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా 1954లో అమెరికాలోని బోస్టన్‌లో తన సోదరుడి మూత్ర పిండం దానంతో రోనాల్డ్‌ జే హెర్రిక్‌ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. కిడ్నీ దానం చేసిన వ్యక్తి మరో 56 ఏండ్లు బతికారు. అయితే ఇప్పటికీ బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేసేందు కు ఆయా కుటుంబాల నుంచి పెద్ద సంఖ్యలో మద్ధతు రాకపోవడంతో అనేకమంది మృత్యువుతో దోబూచులాడు తున్నారు. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్‌, కండ్లను ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. బతికుండగానే కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జను కుటుంబసభ్యుల కోసం దానం చేస్తుంటారు. రాష్ట్రంలో అవయవదానాన్ని ప్రోత్సహించేం దుకు వీలుగా ‘జీవన్‌దాన్‌’

ఇదీ లెక్క
నేషనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ – 1,03,223 మంది. వీరిలో మహిళలు, పురుషులు, పిల్లలు ఉన్నారు.
ప్రతి రోజు1300 నుంచి 1500 మంది అవయవదానం కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఒక్కో డోనర్‌ 8 మంది జీవితాల్లో వెలుగులు నింపగలరు.
2024లో 48వేలకు పైగా అవయవదానాలు జరిగాయి.
ప్రతి 8 నిముషాలకు ఒకరు చొప్పున అవయవదానాల వెయిటింగ్‌ లిస్ట్‌లో చేరుతున్నారు.
ఏటా ఆగస్టు 3న భారతీయ అవయవదాన దినం నిర్వహిస్తారు.

అంతర్జాతీయంగా…
ఫ్రాన్స్‌ 2017లోనే అవయవదానాన్ని తప్పనిసరి చేసింది. ఎవరికైనా ఇష్టం లేకపోతే ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. లేదంటే వ్యక్తి చనిపోగానే వైద్యులు తప్పనిసరిగా వారి అవయవాల్ని సేకరిస్తారు. డెన్మార్క్‌, జర్మనీ, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ తదితరాల్లోనూ అవయవదానంపై నిర్దిష్టమైన విధివిధానాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -