గి దినం లోకానికి ఉపాధ్యాయుల దినం అంట, పోయిన నెల 5 తారీకు మన దేసమ్ ల ఉపాధ్యాయుల దినం జరుపుకున్నారు కడ గట్లె ఇప్పుడు లోకంల జరుపుకుంటారు, అంటే గి దినం మనం మన గుర్వుల ను పూజించు కోవాలి, మనకు బడిలో సద్వు సెప్పేటోళ్ళే గురువులు కాదు మనకు తెలియనివి చెప్పాయి వాళ్ళు ,మంచిగా మంచి ఇషయాలు చెప్పేవాళ్ళు, మంచి దార్ల సూపించేవాల్లు కూడా గుర్వులే.
మన గుర్వులు మన నుండి ఎం అడగరు మనం బాగు పడితే అదే సాలు అనుకుంటారు.. మన గుర్వులను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు, అర్థమైందర రితికేష్, సరే సరే.. ఎం రా నర్సిములు ఏమొ అంటున్నావ్, అవును వద్ధుల దినం కూడా మనం చెప్కోవాలే, ఎం రా అశోకు మి అవ్వ గురించి ఎం అన్న తెలుసారా, అగ అవునా, అట్లా అనకూడదురా, మనం ముసలోళ్ళని కూడా గవ్ర వించుకోవాలి, ఎప్పుడు ముసలోళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, ముసలోళ్ళు అంటే మనం లైబ్రరీ అంటాం సుడు అట్లా ఒక గంతలైయం లాంటోళ్ళు. ఒక్క ఒక్క ముసలోళ్ళు ఒక్క ఒక్క గంథాలయం లాంటోళ్ళు. ఒక్క ముసలోళ్ళు సచ్చిపోతే ఒక్క గంతలైయం కాలిపోయినట్టే ….
ఎం రా సూకేష్, గర్భ ఆడుతున్నారా రా, అమ్మ వారి నిమర్జమం చేస్తుండ్ర, అవునా, ఎప్పుడు చేస్తారు, రాత్రి క, సరే సరే, గాంధీ తాత పుట్టిన రోజు కూడా ఈ రోజే కదా, అతను పుట్టినరోజును మనం జరుపుకోవదమ్ అంటే మనం అతను చేసిన పనులు, చెప్పిన విషయాలను నెమరేస్కోవడమే.
ఎం రా రామ కృష్ణ, గుడి దగ్గర ఎం గొడవ రా, అవునా న్మర్జనం చేసే దగ్గర జాగ్రత్తగా పొంద్ర, బత్కమ్మ ఆడుతున్నారా రా, అవునా ఆడుతునర సరే ఆడుకోండి కాని గొడవలల్లకి పోకండి.
జమ్మి పెడ్తా అంటివి గా రా అశోక్ అందరు రండి ఒకరికొకరి జమ్మి పెట్టుకొని అలైభై చేస్కోండి, అరె అరె నా కాలు ఎం మొక్కకంది రా, ఓ పెద్ద వాళ్ళ గురించి చెప్పినందుకు మొక్కుతున్నావా సరే సరే, ముందు అమ్మ ,నాన్నలు జమ్మి పెట్టి వాల ఆశీర్వాదం తీస్కునర, అవునా సరే. అందరు, లోకం ల ఉన్న గురువులందరికీ చేతులెత్తి మొక్కుండ్రి, అందరి దీవెనలు ఉంటే ఎంత అతుకైనా ఎధగా జల్తారు, అప్పుడైనా మీరు కూడా గొప్ప గురువులైతారేమో.
- గంగరాజ పద్మజ, 9247751121