Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంఅరేబియా సముద్రంలో 'శక్తి' తుఫాన్‌

అరేబియా సముద్రంలో ‘శక్తి’ తుఫాన్‌

- Advertisement -

ఢిల్లీ : అరేబియా సముద్రంలో తీవ్రమైన ‘శక్తి’ తుఫాన్‌ ఏర్పడింది. ప్రస్తుతం గుజరాత్‌, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్‌ కదులుతోందని వెల్లడించింది. ఈ తుఫాన్‌ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుజరాత్‌ తీరంలో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర, పాకిస్థాన్‌ తీరం వెంబడి పరిస్థితులు ఉధృతంగా ఉంటాయని అంచనా వేసింది. ఇక ముంబై, థానే, పాల్ఘర్‌, రారుగడ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌లో అక్టోబర్‌ 7వరకు భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. అలలు భారీ స్థాయిలో ఎగిసిపడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -