విశ్రాంత ఐఏఎస్ కెవి.రమణాచారి
‘5వ పిల్లల జాతర’ ఆహ్వాన కమిటీ ప్రకటన
నవతెలంగాణ – ముషీరాబాద్
పిల్లల జాతర ఉత్సవాలు విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడతాయని విశ్రాంత ఐఏఎస్ కెవి.రమణాచారి అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద గల రమణాచారి నివాసంలో శనివారం తెలంగాణ బాలోత్సవం ‘5వ పిల్లల జాతర’ పోస్టర్ ఆవిష్కరించి రిసిప్షన్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బాలోత్సవం ‘5వ పిల్లల జాతర 2025’ నవంబర్ 6, 7 తేదీల్లో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని సూచిం చారు.
కమిటీ చైర్మెన్‌గా కెవి.రమణాచారి, చీఫ్ ప్యాట్రన్స్‌గా జస్టిస్ జి.రాధారాణి (రిటైర్డ్ జడ్జి-తెలంగాణ హైకోర్టు), అశోక్ తేజ (ఫేమస్ సినీ లిరికిస్ట్), ఏనుగు నరసింహారెడ్డి (డైరెక్టర్ -భాష సాంస్కృతిక శాఖ), ఎం.డి.రియాజ్ (చైర్మెన్-గ్రంథాలయ శాఖ), ప్యాట్రన్స్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్‌గా మొత్తం 90మంది కమిటీలో ఉన్నారని తెలిపారు. ఈ పిల్లల జాతరలో 24 కార్యక్రమాలు 24 వేదికలపై విద్యార్థు లను సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ కేటగిరీలుగా విభజించి వారి ఆసక్తికి తగిన అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు.ఈ మహాత్కార్యానికి విద్యా సంస్థల యాజమాన్యాలు, మేధావులు, తల్లిదండ్రులు సహరించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్. సోమయ్య, అధ్యక్షులు – భూపతి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సుజావతి, మహేష్ దుర్గే, జె.వెంకన్న పాల్గొన్నారు.
పిల్లల జాతర ప్రతిభా వికాసానికి వేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES