– రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి రవాణా
– అంతా మా”మాముల్లా ” మహిమన లేక అధికారుల నిర్లక్ష్యం మా…??
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఆదివారం మిట్ట మధ్యాహ్నం కాటారం చెరువు నుండి మట్టి, ఇసుక విలాసాగర్ గోదావరి నుండి గుట్టుగా అక్రమ రవాణా రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్ యజమానులు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చూసిచూడనట్లు ఉంటున్నారు. పట్ట పగలు మట్టి, ఇసుక దందా జరుగుతుంటే అధికారుల అంతా “మాములే ” అన్నట్లు ఉంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను, మట్టిని తరలిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక, మట్టి వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు జన సంచారం లేని సమయంలో యథేచ్చగా ఇసుకను, మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. రాత్రి వేళల్లో పలు గ్రామాలకు, కాలనీలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ వాహనాల శబ్దానికి నిద్ర పట్టట్లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇసుక ట్రాక్టర్ వాహనాలు ఓవర్ స్పీడుతో వెళుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్రమంగా తరలిస్తున్న ఇసుక, మట్టి ట్రాక్టర్ల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాటారం మండల ప్రజలు కోరుతున్నారు.