- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో తాండవాసులు ఎవరు కల్వర్టు వైపుకు రాకూడదని ఎంపీడీవో లలిత కుమారి అన్నారు. ఆదివారం మండలంలోని బెజిగం చెరువు తండాకు వెళ్లే రోడ్డును ఆమె పరిశీలించారు. కల్వర్టు వద్ద వరద నీరు భారీగా ప్రవహించే అవకాశం ఉన్నందున తండావాసులు ఎవరు కూడా కల్వర్టు వైపుకు రాకూడదని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీ ఓ ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శి అనిత తండావాసులు ఉన్నారు.
- Advertisement -