Monday, October 6, 2025
E-PAPER
Homeదర్వాజఅర్థం కాని అర్థశాస్త్రం

అర్థం కాని అర్థశాస్త్రం

- Advertisement -

విత్తమంత్రి విశాల హృదయానికి
వీర విధేయుల వీరంగ విన్యాసాలు
బాజా భజంత్రీల భక్తాందులు
బ్రహ్మాండమంటూ భజనలు చేస్తున్నారు
భళాభళి అంటూ బాకాలు ఊదుతున్నారు
గాట్లు పడేటట్లు గుండు కొట్టి
గాయపడ్డ గుండుకు గంధం పూస్తే
గప గప మంటున్న గాట్లు గుర్తుండవా?
అట్టలూడేల వాతలు వేసి హాయిగా ఉంటుందని మలాం రాస్తే
మనసులో ఉన్న మంట తగ్గుతుందా?
ఏడు ఎనిమిది ఏండ్ల ఎటమటం పనికి
సెప్టెంబర్‌ ఇరవైరెండు నుండి సెలవంటే
చంకలు గుద్దుకోవాలో సంబురాలు చేసుకోవాలో
అర్థశాస్త్రం అర్థం కాక ఆగమాగం అవుతున్నాం.

  • డా.ఎడ్ల కల్లేశ్‌, 9866765126
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -