Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలురెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని 8మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని 8మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని పాతబస్తీకి చెందిన 8మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టోలిచౌకి పోలీసులు, బాధిత కుటుంబీకుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన ఖాలేద్‌ వ్యాపారి. టోలిచౌకిలో నివసించే సోదరి కుటుంబసభ్యులు శుక్రవారం ఖాలేద్‌ ఇంటికి వచ్చారు. పదోతరగతి చదువుతున్న అహ్మద్‌ బిన్‌ ఖాలేద్, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న సయ్యద్‌ అఫ్నాన్, ఇంజినీరింగ్‌ చదువుతున్న మహ్మద్‌బిన్‌ ఖాలేద్, ఏడోతరగతి చదువుతున్న సయద్‌ అద్నాన్, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న లైబాఫాతిమాతో పాటు మరో ముగ్గురు యువతులు శుక్రవారం రాత్రి టోలిచౌకి ఠాణా పరిధిలోని పారామౌంట్‌కాలనీలోని అల్‌వదీ యెమినీ రెస్టారెంట్‌కు వెళ్లి మండీ బిర్యానీ తిన్నారు. ఆ సమయంలో రెస్టారెంట్‌ సిబ్బంది వారికి నిషేధిత మయోనీస్‌ కూడా సమకూర్చారు. శనివారం ఉదయం నుంచి వారికి వాంతులతో పాటు విరేచనాలు మొదలయ్యాయి. దగ్గరలోని ప్రయివేటు ఆస్ప‌త్రికి తరలించి అక్కడి నుంచి కోరెంటి ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖాలేద్‌ ఆదివారం సాయంత్రం టోలిచౌకి పోలీస్‌స్టేషన్‌లో రెస్టారెంట్‌ యజమాని సాలంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -