Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

స్థానిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్ 
నవతెలంగాణ – బల్మూరు: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ పార్టీని ఓడించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్  పిలుపునిచ్చారు. కాంగ్రెస్  ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే రిజర్వేషన్లకు బిజెపి అడ్డుపడుతుందని విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని కొండనాగుల గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ సమావేశము కామ్రేడ్ మహేందర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్ మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, కార్మిక చట్టాలను కాలరాస్తుందని బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకుంటుందని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటున్న బీజేపీని ఎక్కడికక్కడ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులుగా మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలు మూడు సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తున్నామని అక్కడ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

నిరంతరం ఎర్రజెండా ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నది ఈ దేశంలో ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయె అని కమ్యూనిస్టు పార్టీకి ఆదరణ ఇచ్చి గెలిపిస్తే ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలు  అనేక ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేశారు. 

బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను గాలికి వదిలేసి కార్పొరేట్ వ్యవస్థకు ఊడిగం చేస్తుందని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీలను ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) పార్టీ బల్మూరు మండల కార్యదర్శి శంకర్ నాయక్, గ్రామ కార్యదర్శి భాస్కర్, బాలయ్య, పరశురాములు గౌడ్, లక్ష్మయ్య, గంగయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -