- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వైద్య శాస్త్రంలో 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. మేరీ ఈ బ్రన్కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమన్ సకగుచిలకు నోబెల్ పురస్కారం దక్కింది. రోగ నిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ముగ్గురికీ పురస్కారాన్ని ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో నోబెల్ బృందం ఈ ప్రకటన చేసింది.
- Advertisement -