Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎమ్మెల్యే మనుమరాలు 

ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎమ్మెల్యే మనుమరాలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
స్థానిక ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి  మనుమరాలు, ఆర్ ఆర్  ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి  దంపతుల కుమార్తె జయ రెడ్డి (వయస్సు 8 సంవత్సరాలు) దేవి నవరాత్రుల సందర్బంగా హైదరాబాద్ తో పాటు దుబాయ్, ఆమెరికా దేశాలలో లలో పలు ఆర్గనైజషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొదట హైదరాబాదద్ లోని శ్రీ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి పలు పురస్కారాలు అందుకోవడం జరిగింది తదనంతరం దుబాయ్ వేదిక (ఇండియన్ పీపుల్స్ ఫోరమ్స్)ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచి పలు బహుమతులు పొందడం జరిగింది.

అలాగే గత మూడు రోజుల క్రితం అమెరికాలోని డల్లాస్ వేదికగా టిపిఏడి ( తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బతుకమ్మ సంబరాలు పాల్గొని కూచిపూడి నృత్యంతో వీక్షకులను ఆకట్టుకొని డల్లాస్ వేదికగా పలు బహుమతులు పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లి ఆర్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి మాట్లాడుతూ.. గురువు అయినటువంటి డాక్టర్ నవ్య నాగబందిని  శిక్షణ ప్రోత్సాహంతో ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని పురస్కారాలు అభినందనలు పొందడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తాతగారు అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశీర్వదించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -