- Advertisement -
ప్రముఖ సైకాలజిస్ట్ కేశవ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రతి వ్యక్తికి శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరమే అని టి. కేశవ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ప్రపంచ అధ్యక్షులు యొక్క పిలుపు మేరకు అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 12 వరకు, మానసిక ఆరోగ్య వారోత్సవాలు లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా ఆధ్వర్యంలో సోమత్ గన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ టి. కేశవ కుమార్ చే మెంటల్ వెల్ నెస్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలప్రధానఉపాధ్యాయురాలు గాయత్రి అధ్యక్షత వహించగా, లయన్స్ క్లబ్ ఆఫ్ 320డి. రీజినల్ చైర్మన్ లయన్. భగవాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- Advertisement -