- Advertisement -
నవతెలంగాణ-బిచ్కుంద
బిచ్కుంద పట్టణంలోని రాజుల్లా రోడ్డులోగల ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు ఎస్సై మోహన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.9,300 ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన బిచ్కుంద పట్టణానిక చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బిచ్కుంద పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహించిన ఆడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాలని వారి పేర్లు గొప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.
- Advertisement -