నవతెలంగాణ-పాలకుర్తి
మండల వ్యవసాయ శాఖ అధికారిగా సింగారపు కరుణాకర్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సోమవారం ఉత్తర్వులు గారి చేశారు. పాలకుర్తి వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న రేపాల శరత్ చంద్ర ను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏవోగా నియమించారు. సోమవారం పాలకుర్తి వ్యవసాయ శాఖ అధికారిగా కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ రైతులందరూ సాగు చేసుకున్న పంటల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఏఈఓ ల వద్ద నమోదు చేయించుకోవాలని సూచించారు. తెగుళ్ల నుండి పంటలను కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. బాధ్యతలు స్వీకరించిన ఏవో కరుణాకర్ ను స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
మండల వ్యవసాయ అధికారిగా కరుణాకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES