Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ కథనానికి స్పందన 

నవతెలంగాణ కథనానికి స్పందన 

- Advertisement -

వనిత టీ స్టాల్ ప్రారంభానికి చర్యలు 
స్థలాన్ని పరిశీలించిన డిఆర్డిఏ అధికారులు 
నవతెలంగాణ-పాలకుర్తి

వనిత టీ స్టాల్ ను ప్రారంభించేందుకు డి ఆర్ డి ఏ అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం  వనిత టీ స్టాల్ ప్రారంభం ఎప్పుడో అనే కథనాన్ని నవ తెలంగాణలో ప్రచురించడంతో స్పందించిన డిఆర్ డిఓపిడి వసంత, అడిషనల్ పీడీ నూరొద్దీన్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. వనిత టీ స్టాల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వనిత టీ స్టాల్ ను సరిత గతిన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వనిత టీ స్టాల్ ఏర్పాటుతో ఎంపీడీవో కార్యాలయానికి వాస్తు దోషం ఏమిటని ప్రశ్నించారు. రెండు రోజుల్లో వనిత టీ స్టాల్ ను ప్రారంభించాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం ఆలయ సమీపంలోని వనిత టీ స్టాల్ కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీరాముల చంద్రశేఖర్, సిసి కారుపోతుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -