నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల నవంబర్‌లో రెండు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆర్జేడీ అధినేత తేజిస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్రంలో పండగ మొదలైందని, ఓటర్ల మార్పును కోరుకుంటున్నారని, మహాఘడీబంధన్ కూటమిని బీహార్ ఓటర్లు ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. మహాఘడిబంధన్ ప్రభుత్వ ఏర్పాటుతో నిరుద్యోగ యువత కల సాహకారమవుతుందని, ఇల్లు లేని ప్రతి నిరుద్యోగికి ఇండ్లు కట్టిస్తామని, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, దీంతో నిరుద్యోగాన్ని కూకటివేళ్లతో పేకలిస్తామని తేజిస్వీ యాదవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్దికి కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా కాకుండా సింహంలా గర్జించే వ్యక్తులను ఎన్నుకోవాలని బీహారీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని జాతీయ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 14న చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖిస్తారని చెప్పారు. నితిష్ పాలనలొ అవినీతి, స్కాంలు, ప్రజలు విసిగేత్తి పోయారని, దీంతో నవ ఆలోచనతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమవైపు ఉన్నారని ఆయన దీమా వ్యక్తం చేశారు.
బీహార్ ప్రజలు తమ వైపే ఉన్నారు: తేజిస్వీయాదవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES